Monday, May 21, 2007

సంకీర్తన 2: వేదవేద్యులు వెదకేటి

సంకీర్తన 2: వేదవేద్యులు వెదకేటి మందు

రాగం: దేసాక్షి

వేదవేద్యులు వెదకేటిమందు

ఆదినంత్యము లేని ఆ మందు


ఆడవి మందులు గషాయములు నెల్లవారు

కడగానక కొనగాను

తొడిబడ నొకమందు దొరకె మాకు భువి-

నడియాలమైనట్టి ఆ మందు


లలిత రసములు దైలములు నెల్లవారు

కలకాలము గొనగాను

చెలువైన దొకమందు చేరె మాకు భువి

నలవి మీరినయట్టి ఆ మందు


కదిసిన జన్మరోగముల నెల్లవారు

కదలలేక వుండగాను

అదన శ్రీ తిరువెంకటాద్రి మీది మందు

అదివొ మాగురుడిచ్చె నా మందు


Sankeertana 2: vedavedyulu vedaketi mandu

Raagam: desakshi

Vedavedyula vedaketimandu

Aadinatyamu leni aa mandu

Adavi mandulu gashayamulu nellavaru

Kadagaanaka konagaanu

Todibada nokamandu dorake maaku bhuvi-

Nadiyaalameinatti aa mandu


Lalita rasamula deilamulu nellavaaru

Kalakaalamu gonagaanu

Cheluveina dokamandu chere maaku bhuvi

Nalavi meerinayatti aa mandu


Kadisina janmarogamula nellavaru

Kadalaleka vundagaanu

Adana SrI tiruvenkataadri meedi mandu

Adivo maagurudicche naa mandu


----------------- శ్రీ వేంకటేశ్వరాయ నమ:----------------

1 comment:

Rama said...

Do you have tune for it sir ? Please provide if you have.