Thursday, May 8, 2008

12. ధన్నాసి

సందడి విడువుము సాసముఖా
మంధరధరునకు మజ్జనవేళా

అమరాధిపు లిడు డాలవట్టములు
కమలజ పట్టము కాళాంజి
జమలిచామరలు చంద్రుడ సూర్యుడ
అమర నిడుడు పరమాత్మనకు

ఆణిమాదిసిరులనల రెడు శేషుడ
మణిపాదుక లిడు మతి చెలగా
ప్రణుతింపు కదసి భారతీరమణ
గుణాధిపు మరుగురు బలుమరును

వేదఘోషణము విడువక సేయుడు
ఆదిమునులు నిత్యాధికులు
శ్రీ దేవుండగు శ్రీ వేంకటపతి
ఆదరమున సిరు లందీ వాడే
sandaDi viDuvumu saasamuKhaa
mandharadharunaku majjanavELaa

amaraadhipu liDu DaalavaTTamulu
kamalaja paTTamu kaaLaanji
jamalichaamaralu chandruDa sUryuDa
amara niDuDu paramaatmanaku

aaNimaadisirulanala reDu SEshuDa
maNipaaduka liDu mati chelagaa
praNutimpu kadasi bhaaratIramaNa
guNaadhipu maruguru balumarunu

vEdaghOshaNamu viDuvaka sEyuDu
aadimunulu nityaadhikulu
SrI dEvunDagu SrI vEnkaTapati
aadaramuna siru landI vaaDE



13.శంకరాభరణము

మలసీ( జూడరో మగసిమ్హము
అలవిమీఱినమాయలసిమ్హము

అదివో చూడరో ఆదిమపురుషుని
పెదయౌభళముమీ(ది పెనుసిమ్హము
వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు
కదిసి కాన(గలేని ఘనసిమ్హము

మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి
చచ్చఱకంటితోడిజిగిసిమ్హము
తచ్చిన వారిధిలోన తరుణి( గౌగిట( జేర్చి
నచ్చినగోళ్ళ శ్రీనరసిమ్హము

బింకమున( జూడరో పిరితియ్యక నేడు
అంకమునదనుజసమ్హారసిమ్హము
వేంకటనగముపై వేదాచలముపై
కింక లేక వడి బెరిగినసిమ్హము

malasI( jUDarO magasimhamu
alavimI~rinamaayalasimhamu

adivO chUDarO aadimapuruShuni
pedayaubhaLamumI(di penusimhamu
vedaki brahmaadulu vEdaantatatulu
kadisi kaana(galEni ghanasimhamu

mecchimecchi chUDarO mitimI~rinayaTTi
chaccha~rakanTitODijigisimhamu
tacchina vaaridhilOna taruNi( gaugiTa( jErchi
nacchinagOLLa SrInarasimhamu

binkamuna( jUDarO piritiyyaka nEDu
ankamunadanujasamhaarasimhamu
vEnkaTanagamupei vEdaachalamupei
kinka lEka vaDi beriginasimhamu


14. కన్నడగౌళ

గాలినైపోయ గల కాలము
తాలిమికి గొంతయు ( బొద్దులేదు

అడుసుచొరనే పట్టె నటునిటు(గాళ్ళు
గడుగుకొననే పట్టె గలకాలము
ఒడలికి జీవుని కొడయ(డైనహరి(
దడవ(గా (గొంతయు( బొద్దు లేదు

కల(చి చిందనే పట్టె( గడవ నించగ(బట్టె
కలుషదేహపుబాధ( గలకాలము
తలపోసి తనపాలిదైవమైన హరి
దల(చగా( గొంతయు( బొద్దు లేదు

శిరసు ముడువ(బట్టె చిక్కుదియ్య(గ( బట్టె
గరిమల( గపటాల (గలకాలము
తిరువేంకటగిరి దేవుడైన హరి
దరిచేరా( గొంతయు బొద్దులేదు

gaalineipOya gala kaalamu
taalimiki gontayu ( boddulEdu

aDusuchoranE paTTe naTuniTu(gaaLLu
gaDugukonanE paTTe galakaalamu
oDaliki jIvuni koDaya(Deinahari(
daDava(gaa (gontayu( boddu lEdu

kala(chi chindanE paTTe( gaDava ninchaga(baTTe
kalushadEhapubaadha( galakaalamu
talapOsi tanapaalideivameina hari
dala(chagaa( gontayu( boddu lEdu

Sirasu muDuva(baTTe chikkudiyya(ga( baTTe
garimala( gapaTaala (galakaalamu
tiruvEnkaTagiri dEvuDeina hari
darichEraa( gontayu boddulEdu


15. వరాళి


ఎవ్వారు లేరూ హితవుచెప్ప(గ వట్టి-
నొవ్వుల( బడి నేము నొగిలేమయ్యా

అడవి( బడినవా (డు వెడల జోటులేక
తొడరి కంపలకిందు దూరినట్లు
నడుమ దురితకాననములతరి(బడి
వెడలలేక నేము విసిగేమయ్య

తెవులువడినవా(డు తిన(బోయి మధురము
చవిగాక పులుసులు చవిగోరినట్లు
భవరోగముల( బడి ప్రమామృతము నోర(
జవిగాక భవములు చవులాయనయ్యా

తనవారి విడిచి యిత్రమైనవారి
వెనక దిరిగి తా వెఱ్ఱైనట్లు
అనయము తిరువేంకటాధీశు( గొలువక
మనసులోనివాని మఱచేమయ్య
15. varaaLi


evvaaru lErU hitavucheppa(ga vaTTi-
novvula( baDi nEmu nogilEmayyaa

aDavi( baDinavaa (Du veDala jOTulEka
toDari kampalakindu dUrinaTlu
naDuma duritakaananamulatari(baDi
veDalalEka nEmu visigEmayya

tevuluvaDinavaa(Du tina(bOyi madhuramu
chavigaaka pulusulu chavigOrinaTlu
bhavarOgamula( baDi pramaamRtamu nOra(
javigaaka bhavamulu chavulaayanayyaa

tanavaari viDichi yitrameinavaari
venaka dirigi taa ve~r~reinaTlu
anayamu tiruvEnkaTaadhISu( goluvaka
manasulOnivaani ma~rachEmayya


16 కాంబోధి

దబ్బలువెట్టుచు( దేలిన దిదివో
ఉబ్బునీటిపై నొక హంసా

అనువున( గమలవిహారమె నెలవై
వొనరివున్న దిదె వొక హంసా
మనియెడిజీవుల మానససరసుల-
వునికి నున్న దిదె వొక హంసా

పాలునీరు నేర్పరిచి పాలలో-
నోలలాడె నిదె నొక హంసా
పాలుపడినయీపరమహంసముల-
వోలి నున్న దిదె వొక హంసా

తడవి రోమరంధ్రంబుల గుడ్ల-
నుదుగక పొదిగీ నొకహంసా
కడువేడుక వేంకటగిరిమీ(దట-
నొడలు వెంచె నిదె యొక హంసా


dabbaluveTTuchu( dElina didivO
ubbunITipei noka hamsaa

anuvuna( gamalavihaarame nelavei
vonarivunna dide voka hamsaa
maniyeDijIvula maanasasarasula-
vuniki nunna dide voka hamsaa

paalunIru nErparichi paalalO-
nOlalaaDe nide noka hamsaa
paalupaDinayIparamahamsamula-
vOli nunna dide voka hamsaaa

taDavi rOmarandhrambula guDla-
nudugaka podigI nokahamsaa
kaDuvEDuka vEnkaTagirimI(daTa-
noDalu venche nide yoka hamsaa

Tuesday, September 25, 2007

Friday, June 15, 2007

సంకీర్తన10: ఇందుకొరకె యిందరును

సంకీర్తన10: ఇందుకొరకె యిందరును
రాగం : మాళవిశ్రీ

ఇందుకొరకె యిందరును నిట్లయిరి
కిందుపడి మరికాని గెలుపెరగరాదు

ఆటమటపు వేడుకల నలయించి మరి కదా
ఘటియించు బరము తటుకన దైవము
ఇటుసేయ నీశ్వరున కీసుగలదా
? లేదు
కుటిలమతి గని కాని గుణి గాన రాదు

బెండుపడ నవగతుల బెనగించి మరి కదా
కొండనుచు బర మొసంగును దైవము
బండు సేయగ హరికి బంతమా
? యటు గాదు
యెండ దాకక నీడ హిత వెరగరాదు

మునుప వేల్పుల కెల్ల మ్రొక్కించి మరి కదా
తనభక్తి యొసగు నంతట్ దైవము
ఘన వేంకటేశునకు గపటమ
? అటుగాదు
తినక చేదును దీపు తెలియనే రాదు


Sankeertana 10: Indukorake indarunu
Raagam: maalavisri


Indukorake indarunu nitlayiri
Kindupadi marikaani geluperagaraadu

Atamatapu vedukalunalayinchi mari kada
Ghatiyinchu baramu tatukana deviamu
Ituseya neeswaruna kIsugaladaa? Ledu
Kutilamati gani kaani guni gaana raadu


Bendupada navagatula benaginchi mari kadaaa
Kondanuchu bara mosangunu deivamu
Bandu seyaga hariki bantama? yaTu gaadu
Yenda daakaka nIda hita veragaraadu


Munupa velpula kella mrokkinchi mari kada
Tanabhakti yosagu nantaTi deivamu
Ghana venkatesunaku gapatama ? atugaadu
Tinaka chedunu deepu teliyane radu

----------------- శ్రీ వేంకటేశ్వరాయ నమ:----------------

సంకీర్తన 9: సహజ వైష్ణవాచార

సంకీర్తన 9: సహజ వైష్ణవాచార

రాగం : సామంత రాగం

సహజ వైష్ణవాచారవర్తనుల
సహవాసమే మాసంధ్య

అతిశయముగ శ్రీహరి సంకీర్తన
సతతంబును మాసంధ్య
మతి రామానుజమతమే మాకును
చతురత మెరసిన సంధ్య

పరమభాగవత పదసేవనయే
సరవి నెన్న మాసంధ్య
సిరివరు మహిమలు చెలువొందగ
వేసరక వినుటె మాసంధ్య

మంతుకెక్క తిరుమంత్ర పఠనమే
సంతతమును మాసంధ్య
కంతుగురుడు వేంకటగిరిరాయని
సంతర్పణమే మాసంధ్య

Sankeertana 9: sahaja vaishNavaachaara

Raagam : Saamanta


sahaja vaishNavaachaaravartanula
sahavaasamae maasaMdhya

atiSayamuga Sreehari saMkeertana
satataMbunu maasaMdhya
mati raamaanujamatamae maakunu
chaturata merasina saMdhya

paramabhaagavata padasaevanayae
saravi nenna maasaMdhya
sirivaru mahimalu cheluvoMdaga
vaesaraka vinuTe maasaMdhya

maMtukekka tirumaMtra paThanamae
saMtatamunu maasaMdhya
kaMtuguruDu vaeMkaTagiriraayani
saMtarpaNamae maasaMdhya

----------------- శ్రీ వేంకటేశ్వరాయ నమ:----------------

Tuesday, May 29, 2007

సంకీర్తన 7: ఇందిరానామ మిందరికి

సంకీర్తన 7: ఇందిరానామ మిందరికి
రాగం : శుద్ధ వసంతం

ఇందిరానామ మిందరికి
కుందనపు ముద్ద వో గొవింద

ఆచ్చుత నామము అనంత నామము
ఇచ్చిన సంపద లిందరికి
నచ్చిన సిరులు నాలుక తుదలు
కొచ్చి కొచ్చి నో గొవింద

వైకుంఠనామము వరద నామము
ఈఎకడ నాకడ నిందరికి
వాకుదెరుపులు వన్నెలు లొకాల
గూకులు వత్తులు నో గొవిందా

పండరినామము పరమ నామము
ఎండలు వాపెడి దిందరికి
నిండునిధానమై నిలిచిన పేరు
కొండల కోనెటి వో గొవిందా

Sankeertana 7: Indiraanaama mindariki

Raagam : Suddha Vasantam

Indiraanaama mindariki
Kundanapu mudda vo govinda

Acchuta naamamu ananta naamamu
Icchina sampada lindariki
Nacchina sirulu naaluka tudalu
Kocchi kocchi no govinda

Veikunthanaamamu varada naamamu
Eekada naakada nindariki
Vaakuderupulu vannelu lokaala
Gukulu vattulu no govindaa

Pandarinaamamu parama naamamu
Endalu vaapedi dindariki
Nindunidhaanamei nilichina peru
Kondala koneti vo govindaa

----------------- శ్రీ వేంకటేశ్వరాయ నమ:----------------

సంకీర్తన 7: సదా సకలము
రాగం : శుద్ధ వసంతం

సదా సకలం సంపదలే
తుద దెలియగవలె దొలగవలయు

ఆహర్నిసమును నా పదలే
సహించిన నవి సౌఖ్యములె
యిహమున నవి యిందరికిని
మహిమ దెలియవలె మానగవలెను

దురంతము లివి దోషములె
పరంపర లివి బంధములు
విరసములౌ నరవిభవములౌ
సిరులె మరులౌ చిరసుఖమవును

గతి యలమేల్ మంగ నాంచారికి
మతియగు వేంకతపతిదలచి
రతులెరుగగ వలె రవణము వలెను
హితమెరుగగవలె నిదె తనకు

Sankeertana 7: sadaa sakalamu

Raagam : Suddha Vasantam

Sadaa sakalam sampadale
Tuda deliyagavale dolagavalayu

Aharnisamunu naa padale
Sahinchina navi saukhyamule
Yihamuna navi yindarikini
Mahima deliyavale maanagavalenu

Durantamu livi doshamule
Parampara livi bandhamulu
Virasamulou naravibhavamulou
Sirule marulou chirasukhamavunu

Gati yalamel manga naanchaariki
Matiyagu venkatapatidalachi
Ratulerugaga vale ravanamu valenu
Hitamerugagavale nide tanaku

----------------- శ్రీ వేంకటేశ్వరాయ నమ:----------------

సంకీర్తన 6: మానుషము గాదు

సంకీర్తన 6: మానుషము గాదు
రాగం : గుండక్రియ

మానుషము గాదు మరి దైవికము గాని
రానున్న అది రాకుమన్న బోదు

అనుభవనకు బ్రాప్తమైనది
తనకు దానె వచ్చి తగిలి కాని పోదు

తిరువేంకట దేవుని
కరుణ చేత గాని కలుష మింతయు బోదు

Sankeertana 6: Maanushamu gaadu

Raagam : Gunda Kriya


Maanushamu gaadu mari deivikamu gaani
Raanunna adi rakumanna bodu

Anubhavanaku braptameinadi
Tanku daane vacchi tagili kaani podu

Tiruvenkata devuni
Karuna cheta gaani kalusha mintayu bodu

----------------- శ్రీ వేంకటేశ్వరాయ నమ:----------------